Wednesday, April 25, 2012
ఫ్రెంచిపాలనలో యానాం పుస్తక సమీక్ష
Posted by
బొల్లోజు బాబా
at
6:22 PM
1 comment:
Labels:
ఫ్రెంచి పాలనలో యానాం,
యానాం జనమిత్ర,
సమీక్ష
Links to this post
Monday, April 16, 2012
Breakfast - by Jacques Prévert
నాతో
ఏమీ మాట్లాడకుండా
అతను
డికాక్షన్ ను
కప్
లోకి తీసుకొన్నాడు
అతను
ఆ కాఫీ కప్ లోకి
కొంచెం
పాలు ఒంపుకొన్నాడు
అతను
దానిలో
చక్కెర
వేసుకొని
ఒక
స్పూనుతో కలయతిప్పి
ఆ
వేడి café
au lait ని తాగి
కప్పు
టేబుల్ పై పెట్టాడు
నాతో
ఏమీ మాట్లాడకుండా
అతను
ఒక సిగరెట్ వెలిగించి
పొగను
రింగులుగా ఒదిలాడు
అతను
సిగరెట్ నుసిని
యాష్
ట్రే లోకి విదిలించాడు
నాతో
ఏమీ మాట్లాడకుండా
నన్ను
కనీసం చూడకుండా
అతను
లేచి
టోపీ
పెట్టుకొని
బయట
వర్షం వస్తున్నందున
రెయిన్
కోట్ వేసుకొని
వానలో
అలా నడుచుకొంటూ
వెళిపోయాడు
ఒక్క
మాటలేకుండా
నాకేసి
అసలు చూడకుండానే....
నేను,
నేను నా చేతుల్లో
మొఖం
పెట్టుకొని
ఏడుస్తూనే
ఉన్నాను.
ఫ్రెంచి కవి Jacques Prévert వ్రాసిన Breakfast (Déjeuner du matin) కు అనుసృజన
ఈ
కవితకు దృశ్యరూపాలు కొన్ని
యూట్యూబ్ లో ఉన్నాయి.
వాటి
లింకులు
పైకి
సాదా సీదాగా అనిపించినా ఈ
కవితలో ఏదో తెలియని శూన్యతను
పరాకాష్టకు చేర్చినట్టు
నాకనిపించింది.
రెండో
వీడియోలోని వ్యక్తులు ఇద్దరూ
మగవాళ్ళు అవ్వటం గమనార్హం
(కవితను
చదివినప్పుడు నాకొచ్చిన
సందేహం అదే.
ఇది
ఎవరిమధ్య జరిగిఉంటుంది అని)
తెలుగు
కవితలు కూడా ఇలా వీడియోల
రూపంలో కనిపించే రోజులు
ఎప్పటికైనా వస్తాయని ఆశిస్తూ
భవదీయుడు
బొల్లోజు
బాబా
Subscribe to:
Posts (Atom)


