Showing posts with label సాంధ్యశ్రీ. Show all posts
Showing posts with label సాంధ్యశ్రీ. Show all posts

Thursday, June 3, 2010

ఆంధ్రప్రభ దిన పత్రికలో వచ్చిన ఒక వ్యాసంలో నా కవిత ప్రస్తావన .....

 ఆంధ్రప్రభ దిన పత్రికలో వచ్చిన ఒక వ్యాసంలో నా కవితల ప్రస్తావన .....

వ్యాసకర్త సాంధ్యశ్రీ గారికి   ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.



పాపికొండల్నే మరో కవి దర్శించాడు. ఆ నదీ నీటి బిందువులోంచి మధుర నాదం విన్పించిందట. అక్కడి ప్రజలగుండెల్లో ఆ నదికీ ఆ కొండలకీ గొప్ప మహత్తు ఉందంటున్నారు ఆ నది పిల్లలకు చాక్లెట్లు పంచిపెట్టే చర్చి ఫాదర్‌లా జాలర్లకు చేపలు పంచుతోందంటున్నాడు. ''నదికి అడ్డంగా పెద్దకొండ / ప్రవాహం ఆగలేదు/ మలుపు తీసుకొంది/ జీవితంలానే / డామ్‌ సంకెళ్లు వేయించుకోబోతున్న / ఈ నదీ ప్రవాహాన్ని చూస్తూంటే జాలేస్తుంది/ ఇకపై కూడికలు, తీసివేతలు ప్రకారం ప్రవహించాలి / ఒక్క క్షణం ఆగానో లేదో/ నది నన్ను దాటుకొని / నవ్వు కొంటూ వెళ్లిపోయింది. -  బొల్లోజు బాబా

పూర్తి వ్యాసాన్ని ఈ క్రింది లింకులో చదవగలరు
http://www.andhraprabha.in/search/article-112855