నా
"ఆకుపచ్చని తడిగీతం" కవితాసంకలనం 2009 సంవత్సరానికి గాను శిలపరశెట్టి రాములు నాయుడు స్మారక ప్రత్యేక ప్రశంసా పురస్కారానికి ఎంపికయ్యింది.

ప్రముఖ కవి, విమర్శకుడు
శ్రీ రాధేయ గారి "అవిశ్రాంతం" ఉత్తమ కవితా సంపుటి పురస్కారం పొందింది. "మగ్గం బతుకు" అనే కవితాసంపుటి ద్వారా చేనేత కార్మికుల దీన స్థితిగతులను అద్భుతంగా అక్షరీకరించి లబ్ధప్రతిష్టులైన రాధేయ గారి సరసన కూర్చునే అదృష్టాన్ని కలిగించిన శిలపరసెట్టి రాములు నాయుడు ట్రస్టు నిర్వాహకులు
శ్రీ మాధవీ సనారా గారికి, న్యాయనిర్ణేతలు శ్రీ రామతీర్ధ గారికి ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.
సమావేశ వివరాలు
సమయం: 5:30 ని.
తేదీ: 04-07-2010
స్థలం: ఆంద్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ సమావేశ హాలు
పురస్కార ప్రధాత:
డా. కాళీపట్నం రామారావు గారు.
నన్నింతకాలం ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించిన బ్లాగ్మిత్రులందరికీ పేరుపేరునా ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.
భవదీయుడు
బొల్లోజు బాబా