Wednesday, December 4, 2019

కోడి పుంజు - Rooster by Shang Qin

కోడి పుంజు - Rooster by Shang Qin
ఆదివారం పూట, పార్కులో ఓ మూల కాలొకటి విరిగిన ఇనుప బల్లపై కూర్చొని, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో కట్టించుకొన్న బిర్యానీని తింటుండగా; అకస్మాత్తుగా గుర్తొచ్చింది- కొన్ని దశాబ్దాలుగా కోడిపుంజు కూత నేను వినటం లేదని.
సూర్యుడిని రమ్మని శాసించే ఆ పక్షిని నా చేతిలొ ఉన్న ఎముకలతో నిర్మించటానికి ప్రయత్నించాను. ఎంతవెతికినా స్వరపేటిక కనిపించలేదు. బహుసా దాని అవసరం లేదేమో. అపరిమితంగా తింటూ తమని తాము ఉత్పత్తి చేసుకోవటమే కదా ఇక మిగిలింది.
కృత్రిమ సూర్యకాంతిలో
స్వప్నాలూ లేవు
ఉదయాలూ లేవు.
Source: Rooster by Shang Qin
అనువాదం: బొల్లోజు బాబా

No comments:

Post a Comment