జీవనది లోపలికి ప్రవహించడం అనే అనుభవం ఎలా వుంటుందో అనుభవించి పలవరించాలంటే ఈ పుస్తకంలోకి అడుగు పెట్టాలి మీరు! అయితే, ఏ కొంతైనా తడవడానికి మీరు సిద్ధంగా వుంటేనే ఈ జీవనది మిమ్మల్ని తనలోకి స్వీకరిస్తుంది. బొల్లోజు బాబా “ఆకుపచ్చ తడిగీతం” ఇప్పుడు రెండో సారి చదువుతున్నప్పుడు వొక కవిని కేవలం కవిగా కాకుండా poet as a self గా చూడడం ఎలానో అర్థమవుతోంది, మనకి తెలీదు కానీ కవిత్వం కూడా వొకprivacy statement. దాని Intensity ని ఇప్పటివరకూ వేరే వేరే రూపాల్లో చెప్పడానికి నిరాకరిస్తూ, లేదా సంకోచిస్తూ వచ్చిన విషయాల్ని చెప్పడం కోసమే self అనే తన సందుకని తెరుస్తూ వెళ్తాడు. బాబా కవిత్వంలోని జీవనది అదే! జీవితం ఆయన్ని ఎంతగా తడిపిందో అదంతా అక్షరాల్లో పిండే శక్తి ఆయనకి వుంది. వొక సాయంత్రం మీరు ఆ నది పక్కన నడుస్తూ వెళుతున్నప్పుడు గాలీ, నదీ గుసగుసలాడుకుంటున్నప్పుడు, ఆకాశం దానికి సాక్ష్యంగా నిల్చొని వున్నప్పుడు ఈ కవి విన్నాడని ఇదిగో ఈ కవిత్వంలో తెలుస్తోంది! ----- అఫ్సర్
ఆకుపచ్చని తడిగీతం కవితా సంకలనాన్ని ఈ క్రింది లింకు లో పొందవచ్చు
https://www.scribd.com/doc/248711440/Akupachani-tadi-geetham