tag:blogger.com,1999:blog-5771848398301084647.post8136497961189985157..comments2024-03-29T10:28:42.035+05:30Comments on సాహితీ-యానం: నీలాపనిందలు (క్రిసెంట్ మూన్ కు తెలుగు అనువాదం)Bolloju Babahttp://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-5771848398301084647.post-83253372573058877252009-08-05T22:30:35.238+05:302009-08-05T22:30:35.238+05:30రవిగారికి
థాంక్సండీ.
మీ అనుభవాన్ని పంచుకొని ఈ సందర...రవిగారికి
థాంక్సండీ.
మీ అనుభవాన్ని పంచుకొని ఈ సందర్భాన్ని మరింత ప్రకాశింపచేసారు.

పసి మనసుతో ఎంత మమేకం కాకపోతే ఇలాంటివి రాయగలడు కవి?

ఈ భావనలే నన్నీ అనువాదానికి పురిగొల్పింది.

ఎన్నో సందర్భాలు, ఎన్నో ఉపమానాలు, ఎన్నో ఉదంతాలు ఆ కవితలలో నాకు సాక్షాత్కరించి, అవన్నీ నిన్నోమొన్నో లేక ఏదో కలలోనో, మా ఇంట్లో జరిగాయి కదా అన్న ఫీల్ ఉన్నాది చూసారూ....... బహుసా నేను వర్ణించలేనేమో. (మాకు ఇద్దరు పిల్లలు- అమ్మాయికి ఎనిమిది సంవత్సరాలు, అబ్బాయికి నాలుగు).

ఆ సార్వజనీనతే టాగోర్ కవిత్వంలోని శక్తి. టాగోర్ కల్పనలోని కాంతి, టాగోర్ అక్షరాలవెనుక కదలాడే ఆకాశం.

ఆ మహానుభావునికి శిరస్సువంచి నమస్కరించటం తప్ప ఈ రోజు నేనింకేం చేయగలను. ఆయన విడిచి వెళ్లిన అక్షర సుమాలను భక్తిగా కళ్లకద్దుకొని శిరసున ఉంచుకోవటం వినా ఏమి చేయగలను.

మీరు చెప్పిన ఉదంతంవంటిదే టాగోర్ వర్ణించిన తీరు వేడుక అనే గీతంలో చూడండి.

భవదీయుడు
బొల్లోజు బాబాBolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-73939067126749278432009-08-04T18:00:08.487+05:302009-08-04T18:00:08.487+05:30భలే ఉందండి. అనువాదంలో అనువాద ఛాయలు లేకపోతే అది గొప...భలే ఉందండి. అనువాదంలో అనువాద ఛాయలు లేకపోతే అది గొప్ప అనువాదం అవుతుంది. మీరు చేసిన అనువాదం అలాంటిదే.

కాకతాళీయంగా మా పాప మొన్న చేసిన పని గుర్తొచ్చింది. - మా పాపకు కొత్త గవును తొడిగి, ఏదో పని మీద లోపలకెళ్ళింది మా ఆవిడ. నేనూ లోపల ఏదో సర్దుతున్నాను. ఇంతలో మా పాప పాక్కుంటూ టాయిలెట్ కెళ్ళి, అక్కడ బిందెలో నీళ్ళు మగ్గులో తీసుకుని గవును మొత్తం తడిపేసుకుందది. నాకు సడన్ గా పాప గుర్తొచ్చి, బయటకొచ్చి చూస్తే - నన్ను చూస్తూ తను చేసిన ఘనకార్యాన్ని నవ్వుతూ చూపించింది.

కోపమూ, చిరాకూ రాకపోగా, భలే నవ్వొచ్చింది.

ఎంతయినా పసి మనసుతో ఎంత మమేకం కాకపోతే ఇలాంటివి రాయగలడు కవి?రవిhttp://blaagadistaa.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-44549182413452086642009-08-04T11:10:37.285+05:302009-08-04T11:10:37.285+05:30ఉషగారికి, భావన గారికి
థాంక్సండీ
బొల్లోజు బాబాఉషగారికి, భావన గారికి
థాంక్సండీ

బొల్లోజు బాబాBolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-14141068438834768362009-08-02T14:13:54.194+05:302009-08-02T14:13:54.194+05:30చాలా బాగుంది బాబా గారు. బంగారు తల్లి సిరా మరకలతో, ...చాలా బాగుంది బాబా గారు. బంగారు తల్లి సిరా మరకలతో, బట్టలు చింపుకుని బిక్క మొకం తో చిట్టి తల్లి కళ్ళ ముందు ప్రత్యక్షమైతే బలే జాలి వేసింది, ముద్దు కూడా వచ్చింది.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-32595635522795233372009-08-02T09:40:58.466+05:302009-08-02T09:40:58.466+05:30నా చిట్టితల్లీ!.. మరి నిన్ను ప్రేమించే మమ్ములనేమని...నా చిట్టితల్లీ!.. మరి నిన్ను ప్రేమించే మమ్ములనేమని పిలుస్తారో!" చిట్టికి తల్లివి, నీవూ ఓ పిచ్చిదానివే అంటారేమో, చందమామనంటి పెట్టుకున్న వెన్నెల నేనని, ఉదయంలోనూ నవ్వే కలువ నేనేనని తెలియని అమాయకులు వారు కనుక. నా చిట్టిని ప్రేమించే నేను చెట్టంత విశాలం, నా ప్రేమ ఆ నీడంత చల్లన...
కొడతానికి సిద్దమయ్యారా బాబా గారు? ఈ రోజు మనసంతా అమ్మతనంతో ఎగిరెగిరి పడుతోంది... :)మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-21713057296435325632009-08-02T01:15:19.821+05:302009-08-02T01:15:19.821+05:30శ్రీధర్ గారు
థాంక్సండి. మీరన్నట్లు అన్ని అనువాదాలు...శ్రీధర్ గారు
థాంక్సండి. మీరన్నట్లు అన్ని అనువాదాలు పూర్తయ్యాయి. దీనిని నెలవంక పేరుతోను మరియు సూఫీ కవిత్వాన్ని ఎడారి అత్తరులు పేరుతోను పి.డి ఎప్ రూపంలో తీసుకొద్దామనుకొంటున్నానండీ. మీ సూచనకు ధన్యవాదములతో.

ఫణీంద్రగారు

మీ కామెంటు ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించిందండి. మీ సహృదయతకు సదా కృతజ్ఞతలతో

భవదీయుడు
బొల్లోజు బాబాBolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-88296146728999994192009-08-01T21:02:49.183+05:302009-08-01T21:02:49.183+05:30బాగుందిబాగుందిడా.ఆచార్య ఫణీంద్రhttps://www.blogger.com/profile/04276910577942432419noreply@blogger.comtag:blogger.com,1999:blog-5771848398301084647.post-46102278020446593382009-08-01T12:52:28.761+05:302009-08-01T12:52:28.761+05:30మీరు అభినందనీయులు. ఠాగూరు ఆత్మ కనబడేలా అనువాదం చక్...మీరు అభినందనీయులు. ఠాగూరు ఆత్మ కనబడేలా అనువాదం చక్కగా వుంది. వీలైతే అన్నీ రాశాక PDF లో పెట్టండిSridharhttp://theuntoldhistory.blogspot.comnoreply@blogger.com