Wednesday, April 16, 2014

కొన్ని జ్ఞాపకాలు....


బెల్లంపల్లి బొగ్గు పుప్పొడి
హన్మకొండ నూతి గుండె లోతూ
చొప్పదండి వాసుల బుష్ కోటు
ఆల్ఫా లో దమ్ బిర్యాని
హెడ్డాఫీసులో లెమన్ టీ .....
కొన్ని జ్ఞాపకాల్ని వదిలించుకోలేం
బుట్టలోని పాములా
బద్దకంగా మెదులుతూంటాయ్.

టాంక్ బండ్ పై  అతిశయంతో
అటూ ఇటూ తిరిగిన ఆంధ్రతేజాలు
గద్దరన్న పాట, కెసియార్ అన్నమాట
కాళోజీ, ఆశారాజు, అఫ్సర్,
స్కైబాబ, గోరటి వెంకన్నల జ్ఞాపకాల్ని
ఎలా చెరుపుకోవాలి?

అయినా
ఎందుకు చెరుపుకోవాలి?
నీ తప్పేముంది
నీకేంకావాలో ముందునించీ
స్పష్టంగానే చెపుతున్నావ్!
మాకే అర్ధం కాలేదు
ఇంత జరిగేదాకా.

నీకూ ఏవో
జ్ఞాపకాలు ఉండే ఉంటాయిలే
చెప్పుకోవటం లేదు కానీ!

కొన్ని జ్ఞాపకాల్ని
చెరుపుకోవాలనుకొన్న కొద్దీ
నత్తగుల్ల మెలికల్లా
వెలుగులోకే తెరుచుకొంటాయి
పూల చుంబనాలలో
చెట్లు అమరత్వం పొందినట్లు
ఈ స్వప్నాలలోనే
జీవిస్తాను నేను.


బొల్లోజు బాబా

5 comments:

  1. Chaalaa chaalaa baagundi. Mee Shaili inkaa baagundi:):)

    ReplyDelete
  2. బాబా ... మీరు చెప్పింది అక్షరాల నిజం
    మథుర జ్ఞాపకాలు ఎప్పటికి
    చేరిగిపోవు

    ReplyDelete
  3. చాల బాగుంది.
    "అయినా
    ఎందుకు చెరుపుకోవాలి?
    నీ తప్పేముంది
    నీకేంకావాలో ముందునించీ
    స్పష్టంగానే చెపుతున్నావ్!
    మాకే అర్ధం కాలేదు
    ఇంత జరిగేదాకా." - ఇది అక్షర సత్యం.
    నిజమే! ఎందుకు చెరుపుకోవాలి?
    అయినా ఎలా చెరుపుకోగలం?
    జ్ఞాపకాల్ని వదిలించుకోలేం
    బుట్టలోని పాములా బద్దకంగా మెదులుతూంటాయ్.
    అభినందన!

    ReplyDelete
  4. ఎగిసే అలలు, రామ్మోహన్ గార్లకు, కామెంటినందుకు థాంక్యూ
    ఫణీంద్ర గారికి, నమస్తే. మీ వ్యాఖ్య సంతోషాన్నిచ్చింది. చాన్నాళ్ళకు ఇలా కలుసుకోవటం ఆనందంగా ఉంది. ధన్యవాదాలతో
    భవదీయుడు
    బొల్లోజు బాబా

    ReplyDelete
  5. Patwardhan Mv మీ కవితనూ,భావోద్వేగాన్నీ అర్థం చేసుకోగలను.///జ్ఞాపకాలు ఎందుకుండవ్? తప్పక ఉంటాయి. ఎవరమైనా చెరుపుకునేంత ఏం జరిగింది మిత్రమా>ఒక భౌగోళిక విభజన ---అంతే కదా! నిత్యం అపోహలూ,అపార్థాలూ,ఆక్రోశాలతో కలిసి ఉండడం కన్నా విభజన ఎంతో మంచిది. మా దగ్గర గుంటూరు నుంచి వచ్చిన మిత్రుడూ,మీ దగ్గర ఆదిలాబాద్ మిత్రుడూ ఇద్దరూ హాయిగానే ఉన్నారు.ఏమంటారు?
    April 16, 2014 at 9:57pm · Like · 5

    Bolloju Baba Dear Patwardhan Mv, నేను చెపుతున్నదీ అదే సోదరా.
    April 16, 2014 at 10:03pm · Like · 3

    Ramachary Bangaru కొన్ని జ్ఞాపకాల్ని
    చెరుపుకోవాలనుకొన్న కొద్దీ
    నత్తగుల్ల మెలికల్లా
    వెలుగులోకే తెరుచుకొంటాయి
    పూల చుంబనాలలో
    చెట్లు అమరత్వం పొందినట్లు
    ఈ స్వప్నాలలోనే
    జీవిస్తాను నేను.
    April 17, 2014 at 10:29am · Unlike · 1

    Srikanth Kantekar పూల చుంబనాలలో చెట్లు అమరత్వం పొందినట్లు ఈ స్వప్నాలలోనే జీవిస్తాను నేను.
    April 17, 2014 at 2:22pm · Like

    కాశి రాజు నత్తగుల్ల మెలికలు వెలుగులోకి తెరుచుకుంటాయి ....... మనలాంటి జువాలజీ జీవులని, వాళ్ళ గుండె సప్పున్ని మెల్లిగా వినిపించారు మాస్టారు ! మీ కవిత ఇక్కడ చూడడం సంతోషం .
    April 17, 2014 at 3:01pm · Unlike · 1

    Afsar Afsar "బుట్టలోని పాములా
    బద్దకంగా మెదులుతూంటాయ్." ఆ ఇమేజ్ భలే పట్టుకున్నారు!
    April 17, 2014 at 6:08pm · Unlike · 3

    Rajasekhar Gudibandi "కొన్ని జ్ఞాపకాల్ని
    చెరుపుకోవాలనుకొన్న కొద్దీ
    నత్తగుల్ల మెలికల్లా
    వెలుగులోకే తెరుచుకొంటాయి" చాలా బాగుందండి ....
    April 17, 2014 at 6:27pm · Unlike · 2

    Arcube Kavi తాజా పోలికలున్నాయి..
    April 17, 2014 at 6:29pm · Like

    Madhu Pemmaraju 'Buttaloni paamulaa baddhakamgaa medhuluthuntaayi" chaalaa baavundhee expression
    April 17, 2014 at 7:52pm · Unlike · 1

    Kapila Ramkumar కొన్ని జ్ఞాపకాల్ని
    చెరుపుకోవాలనుకొన్న కొద్దీ
    నత్తగుల్ల మెలికల్లా
    వెలుగులోకే తెరుచుకొంటాయి.......
    April 19, 2014 at 6:28am · Like

    Kavi Yakoob నీకూ ఏవో
    జ్ఞాపకాలు ఉండే ఉంటాయిలే
    చెప్పుకోవటం లేదు కానీ!
    April 19, 2014 at 9:22am · Unlike · 1

    Bolloju Baba thank you for all for sharing my thoughts.

    ReplyDelete